
రాజకీయాలు

ఏపీలో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపుకు ఏఐ ఆధారిత సేవలను వినియోగించనున్నట్లు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మొబైల్ ద్వారా శిశువుల బరువు, ఎత్తు తదితర వివరాలను నమోదు చేసే విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. దీనికి ఆశా యాప్‌తో ‘శిశు మాపన్’ యాప్‌ను అనుసంధానించనున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఏఐ ఆధారిత శిశు ఆరోగ్య సేవలను విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!