
సినిమాలు

అదితి రావు హైదరికి టాలీవుడ్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలే సమ్మోహనం, అంతరిక్షం 9000 KMPH, వి, మహా సముద్రం కానీ ఆమెకు ఇక్కడ మంచి అభిమాన వర్గం ఉంది. మొదటి చిత్రం సమ్మోహనం మంచి హిట్ కాగా, మిగతావి సగటుగా నడిచాయి. టాలీవుడ్‌తో పాటు హీరామండి వంటి OTT హిట్స్ నుంచి మ్యూజిక్ వీడియోల వరకు విభిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఆమె కొనసాగుతోంది. ఇటీవల సూపర్వుమనియా గ్రేస్‌ఫుల్ వారియర్ అవార్డు పొందిన తర్వాత అదితి అందరి దృష్టిని ఆకర్షించింది. సాఫ్ట్ సిల్క్ చీర, డీప్ బ్లాక్ బ్లౌజ్, నిటారుగా కట్టిన జుట్టు, బోల్డ్ చోకర్ అన్నీ కలిసి ఆమెకు ఓ క్లాసిక్ లుక్ ఇచ్చాయి. మినిమల్ మేకప్‌తో అదితి తన సహజమైన గ్రేస్‌ను మరింత మెరిపించింది. ప్రస్తుతం ఆమె పరివారక్ మనురంజన్ అనే హిందీ చిత్రం మరియు లయనెస్ అనే ఇంగ్లీష్ సినిమాను షూట్ చేస్తోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!