
ఓటీటీ

ఎకానమీ తరగతిలో తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా కొత్తగా “బేసిక్ ఫేర్” విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ఉచిత భోజనం కావాలనుకునే వారు వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ ఛార్జీలను ఎంచుకోవచ్చని పేర్కొంది.
బేసిక్ ఫేర్‌లో ప్రయాణించే వారికి 15 కిలోల చెక్డ్ బ్యాగేజ్, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్ అనుమతితో పాటు టీ లేదా కాఫీ ఉచితంగా అందిస్తారు. అయితే ఉచిత భోజనం ఉండదు. భోజనం అవసరమైతే విమానం బయలుదేరే 24 గంటల ముందే శాఖాహారం, మాంసాహారం, జైన, మధుమేహ రోగుల కోసం ప్రత్యేక భోజనాలను ముందస్తుగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానానికి ప్రయాణికుల స్పందన ఆధారంగా భవిష్యత్ నిర్ణయం తీసుకోనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!