

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్ తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సన్నాహాలు వేగవంతం చేసింది. మార్కెట్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ వారంలోనే సెబీకి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.36 వేల నుంచి రూ.40 వేల కోట్ల వరకు) సమీకరించాలని సంస్థ భావిస్తోంది.
జూన్ 19న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో జియో ఐపీఓపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా ఐపీఓ టైమ్‌లైన్‌తో పాటు రిలయన్స్ రిటైల్ విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ ఐపీఓలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.6 డివిడెండ్ ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించే అవకాశముంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!