
సినిమాలు

అమెరికా బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐపీవో ఫైలింగ్ పూర్తి చేసిన ఈ సంస్థ వచ్చే నెలలో “SPCX” టికర్ సింబల్‌తో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. స్పేస్ఎక్స్ విలువ దాదాపు 1.25 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.
స్పేస్ఎక్స్లో భారీ వాటాలు కలిగిన ఎలాన్ మస్క్, ఈ ఐపీవోతో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఆయన వాటాల విలువే 600 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. గత ఏడాది కంపెనీ 18.6 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించినప్పటికీ 4.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ కూడా 850 బిలియన్ డాలర్ల విలువతో ఐపీవోకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!