

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తొలి విడతలో రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. మొత్తం రూ.100 కోట్ల విలువైన నోట్లను విడుదల చేసి, వాటి చలామణి, నాణ్యత, వినియోగంపై కొంతకాలం పరిశీలన చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, కేంద్రం నుంచి కూడా ఆమోదం లభించిందని తెలిపారు.
కొత్త నోట్ల పనితీరును అంచనా వేసిన తర్వాత ఇతర విలువల నోట్లను కూడా ప్లాస్టిక్ కరెన్సీగా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగితపు కరెన్సీతో పోలిస్తే నిర్వహణ, ఖర్చుల పరంగా ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనంలో తేలినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. లైట్‌వెయిట్ పాలిమర్ మెటీరియల్‌తో ఈ నోట్లను తయారు చేయనున్నట్లు వివరించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!