
.webp&w=3840&q=75)
ప్రముఖ మొబైల్ కంపెనీ నథింగ్ దేశీయ మార్కెట్లో కొత్తగా నథింగ్ ఫోన్ 4ఏ మరియు నథింగ్ ఫోన్ 4ఏ ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. లండన్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ కార్ల్ పై ఈ ఫోన్లను అధికారికంగా ప్రకటించారు. ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన గ్లిఫ్ మాట్రిక్స్ లైటింగ్, శక్తివంతమైన ఫీచర్లతో ఈ ఫోన్లను తీసుకొచ్చారు. నథింగ్ 4ఏలో స్నాప్డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP పెరిస్కోపిక్ లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా అందించారు. 5,400mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ ధర రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఇక నథింగ్ ఫోన్ 4ఏ ప్రోలో పెద్ద గ్లిఫ్ మాట్రిక్స్, 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. 50MP సోనీ ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, ఐపీ65 రేటింగ్, శక్తివంతమైన బ్యాటరీతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 4ఏ ప్రో ధర రూ.39,999 నుంచి ప్రారంభమవుతుంది. నథింగ్ ఫోన్ 4ఏ మార్చి 13 నుంచి, 4ఏ ప్రో మార్చి 27 నుంచి ఫ్లిప్కార్ట్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!