
జనరల్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు జూన్ నెల అత్యంత నష్టదాయకంగా మారింది. గత 25 ఏళ్లలో ఇదే అత్యంత దారుణమైన నెలగా నమోదైంది. కంపెనీ షేర్ విలువ 17 శాతం పడిపోవడంతో ఒక్క నెలలోనే 570 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ కోల్పోయింది. 2000 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి అని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, పెట్టుబడులపై రాబడులపై అనిశ్చితి నెలకొంది. అజూర్ క్లౌడ్ బిజినెస్ పనితీరు కూడా అంచనాలను అందుకోకపోవడంతో మదుపర్లలో ఆందోళన పెరిగింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు వాటాలను విక్రయించడంతో షేర్లు ఒత్తిడిలో పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!