

ఏఐ విప్లవం కారణంగా డేటా కేంద్రాల అవసరం భారీగా పెరగడంతో మెమొరీ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ చిప్ విభాగం భారీ వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల త్రైమాసికంలో ఆదాయం గణనీయంగా పెరగడంతో, చిప్ విభాగంలోని ప్రతి ఉద్యోగికి సుమారు రూ.3.25 కోట్ల బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయానికి బోర్డు ఆమోదం కూడా లభించినట్లు సమాచారం.
ఉద్యోగుల సమ్మె హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారిత బోనస్‌లు, జీతాల పెంపు వంటి డిమాండ్లతో ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవ్వగా, ఉత్పత్తి నిలిచిపోతే ప్రపంచ సరఫరా గొలుసుపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో కంపెనీ ఒప్పందానికి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 78 వేల మంది ఉద్యోగులకు భారీ బోనస్ లభించనుంది. ఇదే తరహాలో ఎస్కే హైనిక్స్ కూడా గతంలో ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!