23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

Writer: Pooja 06:26 AM, 23 సెప్టెంబర్, 2026
ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ప్రాంతీయ విమానయానాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టిన ఉడాన్‌ 2.0 ద్వారా విమానయాన రంగంలో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.60,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా సుమారు రూ.30,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర విమానయాన శాఖ, భారతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్పైస్‌జెట్‌ నిర్వహణ, ఆర్థిక పరిస్థితులను డీజీసీఏ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. అత్యవసర పరపతి హామీ పథకం కింద ఇప్పటికే ఆ సంస్థకు రూ.150 కోట్ల సహాయం అందించినట్లు చెప్పారు. ప్రస్తుత విమాన ప్రయాణ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే దేశంలో ఒక్కొక్కటి సుమారు 100 విమానాలతో కూడిన ఐదు విమానయాన సంస్థల అవసరం ఉందని పేర్కొన్నారు.

విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు విమానయాన సంస్థల్లో వాటాలు కలిగి ఉండే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థల్లో వాటాలు కలిగి ఉండటంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. పండుగ సీజన్‌లో విమాన చార్జీలు సముచితంగా ఉండాలని కోరిన ఆయన, చార్జీలపై గరిష్ఠ పరిమితి విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమానయాన సంస్థల ఇంధన వ్యయాలు పెరిగాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

ట్యాగ్లు
ఉడాన్‌ 2.0ప్రాంతీయ విమానయానంరామ్మోహన్‌ నాయుడువిమానయాన పెట్టుబడులుస్పైస్‌జెట్‌విమానాశ్రయాల అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు
జనరల్

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు
జనరల్

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం
క్రీడలు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ
బిజినెస్

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు
రాజకీయాలు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం
జనరల్

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ
జనరల్

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!