

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు వినియోగదారులపై భారంగా మారుతున్నాయి. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 వరకు పెరగగా, అంతర్జాతీయ చమురు మార్కెట్ ప్రభావంతో మరో 90 పైసలు పెరిగినట్లు సమాచారం. జూన్ నెలలో అయినా ధరలు తగ్గుతాయనే ఆశతో ప్రజలు ఎదురుచూసినా ఇప్పటివరకు ఉపశమనం లభించలేదు.
పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్: పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82
వరంగల్: పెట్రోల్ రూ.115.35, డీజిల్ రూ.103.49
విశాఖపట్నం: పెట్రోల్ రూ.116.50, డీజిల్ రూ.104.21
విజయవాడ: పెట్రోల్ రూ.117.78
సీఎన్‌జీ ధరలు
హైదరాబాద్: కిలో రూ.97.00
వరంగల్: కిలో రూ.95.00
విశాఖపట్నం: కిలో రూ.92.50
విజయవాడ: కిలో రూ.91.00
వివిధ ప్రాంతాల్లో కిలో సీఎన్‌జీ ధరలు రూ.93.50 నుంచి రూ.97.00 మధ్య కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు, ప్రయాణికులు, రవాణా రంగం ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!