

కీలక ఖనిజాల విలువ ఆధారిత ప్రాసెసింగ్ పార్కులను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. దేశంలో కీలక ఖనిజాల సరఫరా శృంఖలాన్ని బలోపేతం చేయడం, వాటి వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గనుల కార్యదర్శి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, కీలక ఖనిజాలకు ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోతే దేశీయంగా లేదా అంతర్జాతీయంగా సమీకరించిన ముడి ఖనిజాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం సాధ్యం కాదని, ఎగుమతులు కూడా కష్టమవుతాయని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా నాలుగు ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా రూ.500 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన సమావేశంలో ఈ పార్కుల కోసం తగిన ప్రాంతాలను ఖరారు చేసినట్లు వెల్లడించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!