

మార్కెట్లో ఆధిపత్యం కలిగిన ఓలా, ఉబర్‌కు గట్టి పోటీగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ అనే కొత్త సహకార రైడ్-హెయిలింగ్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ ప్లాట్ఫామ్లో డ్రైవర్ల నుంచి ఏ కమీషన్ వసూలు చేయవద్దు, కేవలం సభ్యత్వ రుసుము మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం ఓలా, ఉబర్ డ్రైవర్ల నుంచి ప్రతి రైడ్‌లో 25% వరకు కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రద్దీ సమయాలు, రైడ్ రద్దులు వంటి కారణాల వల్ల ప్రయాణికులపై అధిక ఛార్జీలు విధిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరికీ లాభం వచ్చే విధంగా ఈ సర్వీస్ రూపకల్పన చేయబడింది.
కేంద్ర సహకార శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) కలిసి దీన్ని రూపొందించారు. సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్ అనే సంస్థను రూ.300 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేశారు. డ్రైవర్లు రోజూ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే, ఫేర్ మొత్తం వారికే దక్కుతుంది.
ఈ సేవలను నవంబర్‌లో ఢిల్లీ లో 650 క్యాబ్‌లతో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తారు. ఆ తర్వాత డిసెంబర్లో ముంబై, పూణె, భోపాల్, జైపూర్ వంటి 20 నగరాలకు విస్తరిస్తారు. వచ్చే మార్చ్ వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవ అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు ఉన్నాయి. 2030 నాటికి లక్ష మంది డ్రైవర్లను దేశవ్యాప్తంగా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయడం లక్ష్యం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!