

వాట్సప్ ఐఫోన్ యూజర్ల కోసం మరో ముఖ్యమైన అప్డేట్ను తీసుకువస్తోంది. ఇప్పటివరకు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఉన్న మల్టీ అకౌంట్ సపోర్ట్ ఫీచర్‌ను ఇప్పుడు ఐఫోన్లలో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి టెస్టింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ ఫీచర్ అన్ని ఐఫోన్ యూజర్లకు అప్డేట్ రూపంలో విడుదల కానుంది.
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతుండటంతో స్పామ్ లింకులు, హ్యాకింగ్ ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ఆండ్రాయిడ్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం దోచుకుంటున్నారు.
ఐఫోన్‌ను హ్యాక్ చేయడం కష్టం కావడంతో, చాలా మంది భద్రత దృష్ట్యా ఐఫోన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అయితే, ఆండ్రాయిడ్‌లో ఉన్న కొన్ని ఫీచర్లు ఐఫోన్లో అందుబాటులో లేకపోవడంతో, వాట్సప్ ఇప్పుడు అవి కూడా చేరుస్తోంది. అందులో ముఖ్యమైనది మల్టీ అకౌంట్ సపోర్ట్.
ఈ ఫీచర్ ద్వారా ఐఫోన్ యూజర్లు ఒకేసారి రెండు వాట్సప్ అకౌంట్లను (వ్యక్తిగతం + ప్రొఫెషనల్) ఒకే యాప్‌లో ఉపయోగించుకోవచ్చు.
వాట్సప్ సెట్టింగ్‌లు(Settings) ఓపెన్ చేయండి
ఖాతా జాబితా(Account List) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
అక్కడ మీ రెండో ఫోన్ నంబర్ ఇవ్వండి
వెంటనే కొత్త వాట్సప్ అకౌంట్ యాడ్ అవుతుంది
ఇలా, ఒకే యాప్‌లో రెండు అకౌంట్లను సులభంగా ఉపయోగించుకోవచ్చు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!