

వివో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన Vivo V70ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V70 మరియు Vivo V70 Elite అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక పేజీ ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లో ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. Vivo V70లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉండగా, Vivo V70 Eliteలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ అందించనున్నారు. అలాగే, జైస్ టెక్నాలజీతో కూడిన రియర్ కెమెరాలతో ఈ ఫోన్లు రానున్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ 6.59 ఇంచుల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు కు మద్దతు ఇస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చని సమాచారం. భారత మార్కెట్లో ఈ సిరీస్ ధర రూ.55 వేల లోపే ఉండొచ్చని అంచనా. Vivo V70 ప్యాషన్ రెడ్, లెమన్ యెల్లో రంగుల్లో, Vivo V70 Elite ప్యాషన్ రెడ్, సాండ్ బీజీ, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.










.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!