

శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజమైన సామ్సంగ్ తన తదుపరి తరం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను ఫిబ్రవరి 25 న జరిగే గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఆవిష్కరించనుందని టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ వెల్లడించారు.
ఈ ఈవెంట్లో గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. లీకుల ప్రకారం, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ప్రీ-ఆర్డర్లు, మార్చి 5 నుంచి 10 వరకు ప్రీ-సేల్, మరియు మార్చి 11 నుంచి అధికారిక విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ టైమ్‌లైన్ ప్రధానంగా దక్షిణ కొరియాకు వర్తిస్తుందని, భారత్‌తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో తేదీల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని సమాచారం. గతంలో టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ కూడా ఫిబ్రవరి 25 లాంచ్ డేట్ ఖచ్చితమని తెలిపారు. ఉత్పత్తి లైనప్ మార్పుల కారణంగా ఈసారి శామ్సంగ్ లాంచ్ షెడ్యూల్లో మార్పు చేసినట్టు తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!