
.jpeg&w=3840&q=75)
పర్ఫార్మెన్స్ పై దృష్టి పెట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్‌గా OnePlus 15R భారత్‌లో విడుదలైంది. ఈ ఫోన్లో క్వాల్కామ్ రూపొందించిన 3nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 12GB LPDDR5x అల్ట్రా ర్యామ్, గరిష్టంగా 512GB స్టోరేజ్ మద్దతు ఉంది. 7,400mAh భారీ బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఫోన్లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది చార్కోల్ బ్లాక్, మింట్ బ్రీస్, ఎలక్ట్రిక్ వైలెట్ రంగుల్లో లభిస్తుంది.
ధరల విషయానికి వస్తే, 12GB + 256GB వేరియంట్ ధర రూ.47,999, కాగా 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.52,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ.44,999 కే పొందవచ్చు. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, OnePlus ఇండియా ఆన్లైన్ స్టోర్, అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో విక్రయాలు మొదలవుతాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత OxygenOS 16పై పనిచేస్తుంది. దీనికి నాలుగు OS అప్డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. 6.83 అంగుళాల ఫుల్-HD+అమోలెడ్ డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ రక్షణతో పాటు ఆధునిక ఐ కేర్ ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌కు అనేక IP రేటింగ్స్ తో ఈ ఫోన్ మరింత బలమైన ఫ్లాగ్షిప్ స్థాయి అనుభవాన్ని అందిస్తుంది.










కామెంట్స్ (1)
Good mobile, excited for the users reviews..