

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం వేగంగా విస్తరిస్తోంది. ఓపెన్ఏఐ రూపొందించిన ఓపెన్ఏఐ “చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0” భారత్‌లో భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన నెల రోజుల్లోనే వినియోగదారులు 100 కోట్లకు పైగా చిత్రాలను సృష్టించి ప్రపంచ స్థాయి రికార్డు నెలకొల్పారు.
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఈ విజయంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇది అద్భుతమైన ఘనతగా పేర్కొన్నారు. ఏప్రిల్ 21న భారత్‌లో ప్రారంభమైన ఈ వెర్షన్ మే 18 నాటికే ఈ రికార్డును సాధించింది.
భారతీయులు సినిమాటిక్ పోర్ట్రేట్ కొలాజ్, మినీ మీ వరల్డ్, అండర్‌వాటర్ పోర్ట్రేట్, అనిమే, చిబి స్టికర్ ప్యాక్, మంగా కామిక్ స్ట్రిప్, ఫ్యాషన్ స్టూడియో పోర్ట్రేట్ వంటి క్రియేటివ్ ప్రాంప్ట్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఏఐ వినియోగం కేవలం ఉత్పాదకతకే కాకుండా క్రియేటివిటీ, ఫ్యాన్డమ్, డిజిటల్ ఐడెంటిటీతో ముడిపడుతోందని ఓపెన్ఏఐ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!