

దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మిడ్-రేంజ్ విభాగంలో విరాట్ కర్వ్ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
లావా విరాట్ కర్వ్ 5జీ అసలు ధర రూ.23,999గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్లు, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో రూ.19,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. 50MP మెయిన్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, ఐఆర్ బ్లాస్టర్, 6,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6GB+128GB స్టోరేజ్, 33W ఛార్జర్ ఇన్‌బాక్స్, మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, IP64 రేటింగ్, వేగన్ లెదర్ ఫినిష్ కూడా ఇందులో ఉన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!