

సర్వమ్ ఏఐ తన తొలి ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ‘సర్వమ్ కేజ్’ను భారత్ మండపంలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ప్రదర్శించింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రకటనతో సంస్థ హార్డ్‌వేర్ తయారీ రంగంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. “ఏఐ ఫస్ట్” డివైస్‌గా పేర్కొన్న ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మే నెల భారత్‌లో విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
సర్వమ్ కేజ్ స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారుడి మాటలను విని, అర్థం చేసుకుని, వెంటనే స్పందించే సామర్థ్యంతో రియల్‌టైమ్ సేవలను అందించనున్నాయి. ఇందులో మైక్రోఫోన్లు, స్పీకర్లు, రెండు కెమెరాలు ఉండి ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, ఏఐ అసిస్టెంట్‌తో కమ్యూనికేట్ చేయడం వంటి ఫీచర్లు ఉంటాయి. వినియోగదారులు సర్వమ్ ఏఐ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమకు అనుకూలమైన అనుభవాలను కూడా రూపొందించుకోవచ్చు. పూర్తిగా భారత్‌లోనే రూపొందించి తయారు చేసిన ఈ గ్లాసెస్‌ను మొదటగా ప్రధాన మంత్రి మోదీ పరీక్షించినట్లు సంస్థ వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!