

గూగుల్ తన AI ఆధారిత రీసెర్చ్ టూల్ NotebookLM లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, యూజర్ గతంలో చేసిన చాట్స్, ఇచ్చిన సూచనలను బట్టి NotebookLM మరింత వ్యక్తిగతంగా సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. గత నెల గూగుల్ సెర్చ్‌లోని AI మోడ్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు NotebookLM కి విస్తరించడమే రెండో అడుగుగా భావిస్తున్నారు.
TestingCatalog అనే వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఫీచర్ రెండు విధాలుగా పనిచేయవచ్చు. ఒకటి మొత్తం NotebookLM కు వర్తించే సాధారణ సెట్టింగ్‌గా, మరొకటి ప్రతి నోట్‌బుక్‌ను విడిగా యూజర్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునేలా ఉండొచ్చు. అయితే ఇది ప్రస్తుతం జీమెయిల్ లేదా జెమినీ వంటి గూగుల్ సేవలతో డేటాను కలపడం కంటే, AI ఎలా స్పందించాలి అనే విధానాన్ని మార్చే ఫీచర్లా మాత్రమే కనిపిస్తోంది. ఇవన్నీ కోడ్ ఆధారంగా బయటకు వచ్చిన సమాచారం మాత్రమే కావడంతో, గూగుల్ అధికారికంగా ప్రకటించే వరకు దీనిపై పూర్తి స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!