

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు వెళ్లనున్న SpaceX Crew - 12 మిషన్‌కు సంబంధించిన తుది ఏర్పాట్లపై ఈనెల 30 న రెండు మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ మిషన్ వచ్చేనెల 15, 2026 కన్నా ముందుగా కాకుండా ఫ్లోరిడాలోని కేప్ కానావెరల్ నుంచి ప్రయోగించనున్నారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇది 12 వ క్రూ రోటేషన్ మిషన్ కావడం విశేషం. ఈ బృందంలో నాసా వ్యోమగాములు జెస్సికా మియర్ (కమాండర్), జాక్ హాతవే (పైలట్), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోఫీ అడెనోట్, రష్యా రోస్కోస్మోస్ వ్యోమగామి ఆండ్రే ఫెడ్యాయెవ్ ఉన్నారు.
స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ – 40 నుంచి ఫాల్కన్ - 9 రాకెట్‌పై క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ఈ మిషన్‌ను నాసా ప్రయోగించనుంది. అంతరిక్ష కేంద్రంలో పలువురు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడంతో పాటు స్టేషన్ నిర్వహణ బాధ్యతలను ఈ బృందం చేపడుతుంది. ఈ మిషన్ క్రూ డ్రాగన్‌కు 13 వ మానవ అంతరిక్ష ప్రయాణంగా నిలవనుండగా, సోఫీ అడెనోట్కు ఇది తొలి అంతరిక్ష మిషన్. అంతర్జాతీయ సహకారంతో పాటు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంలో సురక్షితమైన, వ్యయసార్ధక అంతరిక్ష ప్రయాణాల లక్ష్యాన్ని నాసా ఈ మిషన్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!