

ఏఐ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్–ఆలీవర్ వైమన్ ఫోరమ్ నిర్వహించిన సర్వే ప్రకారం, ఏఐ ప్రభావంతో ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దాదాపు 415 మంది సీఈఓల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో, చాలా కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలపై వెనుకంజ వేస్తున్నట్లు వెల్లడైంది.
కోడింగ్, డాక్యుమెంట్ విశ్లేషణ, రిపోర్టుల తయారీ, కస్టమర్ సపోర్ట్ వంటి పనుల్లో ఏఐ వినియోగం పెరగడంతో కంపెనీలు అనుభవజ్ఞులైన ఉద్యోగులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం, విచక్షణతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో ఏఐ ఇంకా పూర్తిస్థాయిలో సమర్థంగా లేదని సర్వే తెలిపింది. అందువల్ల ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్ ఉద్యోగులకు అప్పగించే ధోరణి పెరుగుతోందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!