

ఆపిల్ తన సిరి వాయిస్ అసిస్టెంట్‌కు భారీ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. యూజర్ల ప్రైవసీని మరింత రక్షించే దిశగా సిరితో జరిగిన AI సంభాషణలను ఆటోమేటిక్‌గా డిలీట్ చేసే కొత్త ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్లను 30 రోజుల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత ఆటో డిలీట్ అయ్యేలా సెటప్ చేసుకోవచ్చు. అవసరమైతే చాట్లను శాశ్వతంగా సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉండనుంది. ఈ అప్డేట్ను ఆపిల్ WWDC ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ఆపిల్-ఓపెన్ఏఐ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. WWDC 2024లో ఆపిల్, చాట్‌జీపీటీని సిరితో అనుసంధానం చేయడానికి ఓపెన్ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందం ద్వారా ఆశించిన వ్యాపార ప్రయోజనాలు రాలేదని భావిస్తున్న ఓపెన్ఏఐ, ఆపిల్‌పై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో గూగుల్ జెమినీ AIతో మరింత లోతైన అనుసంధానం కోసం ఆపిల్ ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే AI ఎకోసిస్టమ్‌లో ప్రైవసీని ప్రధాన ఆకర్షణగా ఆపిల్ నిలబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!