

యాపిల్ 2026 లో తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఐఫోన్ ఫోల్డ్ పేరుతో విడుదల చేయనున్నట్లు బలమైన ప్రచారం కొనసాగుతోంది. అయితే ఇదొక్కటే కాకుండా, మరో ఫోల్డబుల్ మోడల్‌పై కూడా ఆపిల్ పరిశీలన చేస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. క్లామ్‌షెల్ డిజైన్‌తో ఉండే ఈ మోడల్‌ను ఐఫోన్ ఫ్లిప్గా పిలవొచ్చని సమాచారం, ఇది ఐఫోన్ ఫోల్డ్ విడుదలైన తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఐఫోన్ ఫోల్డ్కు చిన్న వెర్షన్‌గా ఉండే ఫోల్డబుల్ ఫోన్‌పై యాపిల్ పని చేస్తోంది. ఇది 2026 రెండో అర్ధభాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, మోటరోలా రేజర్ తరహాలో చతురస్రాకార క్లామ్‌షెల్ డిజైన్‌తో ఈ ఐఫోన్ ఫ్లిప్ ఉండొచ్చని అంచనా. అయితే, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అమలవుతుందనే హామీ లేదని నివేదిక స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఐఫోన్ ఫోల్డ్ మంచి డిమాండ్‌ను సృష్టిస్తుందని యాపిల్ ఆశిస్తోంది. ఈ ఫోన్లో 5.5 అంగుళాల అవుటర్ స్క్రీన్, తక్కువ క్రీజ్ కనిపించే హింజ్ డిజైన్, డ్యూయల్ రియర్ మరియు సెల్ఫీ కెమెరాలు ఉండొచ్చని సమాచారం. 2 నానోమీటర్ టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్సెట్, C2 మోడమ్తో నెట్వర్క్ సపోర్ట్, పవర్ బటన్‌లో టచ్ ఐడీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఐఫోన్ ఫోల్డ్ కంటే పెద్ద ఫోల్డబుల్ మోడల్‌ను కూడా యాపిల్ తీసుకురావొచ్చని అంచనా.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!