

ఆంత్రోపిక్ ఒక కొత్త ఏఐ టూల్ అయిన ఇంటర్వ్యూయర్ ని లాంచ్ చేసింది. ఇది యూజర్లు ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారు, వారి అభిప్రాయాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ టూల్ ఒక వారం పాటు క్లాడ్ లో పాప్-అప్‌గా కనిపించి, చిన్న ఇంటర్వ్యూ లో పాల్గొనమని అడుగుతుంది. ఇంటర్వ్యూయర్ పూర్తిగా క్లాడ్ మోడల్ మీదే పనిచేస్తుంది. ఇది ప్రశ్నలు తయారు చేయడం, ఇంటర్వ్యూ తీసుకోవడం, ఆ సమాధానాలను సారాంశం చేయడం అన్నీ ఆటోమేటిక్‌గా చేస్తుంది. ఇదివరకు ఈ టూల్ 1,250 మంది ప్రొఫెషనల్స్‌తో ఇంటర్వ్యూలు కూడా చేసింది, వాటి రిజల్ట్స్‌ని ఆంత్రోపిక్ బయటపెట్టింది. టూల్ మూడు దశల్లో పనిచేస్తుంది ముందుగా ప్రశ్నలు ప్లాన్ చేయడం, తర్వాత పాల్గొనేవారితో మాట్లాడటం, చివర్లో ఏఐ మరియు హ్యూమన్ రీసెర్చర్లు కలిసి రిజల్ట్స్‌ని అనాలిసిస్ చేయడం.
సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది ఏఐ గురించి పాజిటివ్‌గా స్పందించారు. సాధారణ వర్కర్స్‌లో 86% మంది ఏఐ వాళ్ల టైమ్ సేవ్ చేస్తుందన్నారు, 65% మంది తమ పనుల్లో ఏఐ పాత్రపై సంతృప్తిగా ఉన్నారు. అంటే, చిన్న పనులు ఏఐ చేస్తుండడంతో వాళ్లు క్రియేటివ్ లేదా హయ్యర్-లెవెల్ వర్క్‌పై ఫోకస్ చేయగలుగుతున్నారు. అయితే కొన్ని సైంటిఫిక్ మరియు క్రియేటివ్ ఫీల్డ్ వాళ్లు జాబ్ ఐడెంటిటీ, డేటా సెక్యూరిటీ, ఏఐ మీద ఎక్కువగా ఆధారపడటం వంటి విషయాలపై కాస్త టెన్షన్‌గా ఉన్నారు. స్టడీలో మరో విషయం బయటపడింది ఏఐ వాడకంలో రెండు విధానాలు ఉన్నాయి: ఆగ్మెంటేషన్ అంటే ఏఐని మనిషితో కలిసి ఉపయోగించడం, ఇది 65% మంది చెప్పారు. ఆటోమేషన్ అంటే ఏఐని పూర్తిగా స్వతంత్రంగా పని చేయనివ్వడం, ఇది 35% మంది చెప్పారు. అంటే ఎక్కువ మంది ఏఐని రీప్లేస్‌మెంట్‌గా కాకుండా, సహాయం చేసే పార్ట్నర్గా చూడటం ఇష్టపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!