

గూగుల్ తాజాగా వర్క్‌స్పేస్ స్టూడియో అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసింది. ముందుగా "వర్క్‌స్పేస్ ఫ్లోస్" పేరుతో కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సర్వీస్‌ను ఇప్పుడు అన్ని పెయిడ్ ఎంటర్ప్రైస్ యూజర్లకు అందిస్తున్నారు. దీని ద్వారా ఈమెయిల్, డాక్యుమెంట్స్, షీట్స్ ,చాట్,మీట్ లాంటి యాప్‌లలో చిన్న చిన్న పనులను లేదా రోజువారీ వర్క్‌ఫ్లోలను ఆటోమేటిగ్గా చేయించే ఏఐ ఏజెంట్స్‌ని తేలికగా తయారు చేసుకోవచ్చు. కోడింగ్ అవసరం లేకుండా, మనం చెప్పినట్లు “ఈమెయిల్ వచ్చిందంటే డేటా తీసుకుని షీట్స్‌లో పెట్టి, తర్వాత చాట్‌లో నన్ను అలర్ట్ చేయి” అంటూ చెప్పినంతే, జెమినీ 3 ఆధారంగా అది ఆటోమేటిక్‌గా ఆ టాస్క్‌ను సెట్ చేస్తుంది.
ఈ ఏఐ ఏజెంట్స్ పూర్తిగా మీ వర్క్‌స్పేస్ అకౌంట్‌తో కలిసిపోయి పనిచేస్తాయి. అంటే మీ ఈమెయిల్స్, డాక్యుమెంట్స్, షీట్స్ వంటి అవసరమైన ఫైళ్లను యాక్సెస్ చేస్తాయి కానీ కంపెనీ ప్రైవసీ రూల్స్‌లోనే పని చేస్తాయి. యూజర్ డేటా గూగుల్ ఏఐ మోడల్స్‌ని ట్రైన్ చేయడానికి ఉపయోగించరని కంపెనీ చెబుతోంది. అలాగే, రెడీమేడ్ టెంప్లేట్స్ కూడా ఉంటాయి కాబట్టి మొదటిసారి ఉపయోగించే వారికి కూడా సులభంగానే ఉంటుంది.
వర్క్‌స్పేస్ స్టూడియో ద్వారా తయారు చేసే ఏజెంట్స్ మూడవ పార్టీ టూల్స్‌తో కూడా కనెక్ట్ అవుతాయి. ఉదాహరణకు అసానా, జిరా, మేల్చింప్, సేల్స్‌ఫోర్స్ వంటివి. ఇలా బయటి డేటా, యాక్షన్స్ అన్నీ ఒకే వర్క్ఫ్లోకి వచ్చేలా సెట్ చేయొచ్చు. మొత్తం మీద, ఆఫీస్ పనులు తక్కువ టైంలో, ఏ మాన్యువల్ ఇన్పుట్ లేకుండా ఆటోమేటిగ్గా జరిగేలా గూగుల్ ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!