

యాపిల్ 2026 లో 2ఎన్ఎం టెక్నాలజీ ఆధారంగా తన తదుపరి తరం ఫ్లాగ్షిప్ మొబైల్ చిప్‌సెట్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సామ్సంగ్ 2ఎన్ఎం ఎక్సినోస్ 2600 ను ఆవిష్కరించిన నేపథ్యంలో, ఐఫోన్ 18 సిరీస్‌కు ఏ20 లేదా ఏ20 ప్రో ప్రాసెసర్‌ను టీఎస్ఎంసీ తయారు చేయనుందని సమాచారం. అయితే సిలికాన్ వెఫర్ల ధరలు పెరగడం వల్ల భవిష్యత్ ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
2ఎన్ఎం ఫ్యాబ్రికేషన్‌కు ఉపయోగించే 12 అంగుళాల సిలికాన్ వెఫర్ల ధరను టీఎస్ఎంసీ సుమారు 30,000 డాలర్లకు పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల ఏ20 లేదా ఏ20 ప్రో చిప్ ఒక్కదానికి యాపిల్ సుమారు 280 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా. ఈ అదనపు వ్యయాన్ని యాపిల్ తానే భరించాలా, లేక 2026 లో విడుదలయ్యే ఐఫోన్ 18 మోడళ్ల ధరలను పెంచాలా అన్న రెండు మార్గాల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!