

టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వికెట్‌కీపింగ్ కూడా సాధన చేస్తున్నట్లు ముంబయి జట్టు కెప్టెన్ సిద్దేశ్ లాడ్ వెల్లడించాడు. విలేకర్లతో మాట్లాడిన లాడ్.. యశస్వి వికెట్‌కీపింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపాడు. ముంబయి లేదా భారత జట్టు తరఫున వికెట్‌కీపర్‌గా వ్యవహరించాలనే ఆలోచన అతడికి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ విషయంపై తనకు పూర్తి స్పష్టత లేదని పేర్కొన్నాడు. సాధారణంగా బ్యాటింగ్‌తో గుర్తింపు పొందిన 24 ఏళ్ల జైస్వాల్ వికెట్‌కీపింగ్ సాధన చేయడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వికెట్‌కీపింగ్‌తో పాటు జైస్వాల్ లెగ్‌స్పిన్ బౌలింగ్‌ను కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సిద్దేశ్ లాడ్ వెల్లడించాడు. 2026-27 రంజీ ట్రోఫీ సీజన్‌కు సన్నాహాల్లో భాగంగా ముంబయి నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో జైస్వాల్ సుమారు 10 ఓవర్ల పాటు వికెట్‌కీపింగ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సాధన భవిష్యత్తులో అతడికి కొత్త బాధ్యతలు అప్పగించేందుకు జరుగుతోందా లేదా సాధారణ నైపుణ్యాభివృద్ధిలో భాగమా అన్నది ఇంకా స్పష్టత లేదు. జైస్వాల్ పాత్రలో మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!