
బిజినెస్

హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగారు. భారత్తో జరిగిన మ్యాచ్లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించారు. కెప్టెన్ షాయ్ హోప్ సెంచరీతో అదరగొట్టగా, 102 పరుగులు చేశాడు. రూథర్ఫర్డ్ 49 పరుగులతో రాణించాడు. షిమ్రాన్ హెట్మయర్ 33, రోవ్మన్ పావెల్ 24, జ్యువెల్ ఆండ్రూ 21 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
చివరి ఓవర్లో వెస్టిండీస్ బ్యాటర్లు 4, 1, 1, 1, 6, 6 పరుగులతో మొత్తం 19 పరుగులు పిండుకున్నారు. భారత బౌలర్లు అర్షదీప్ సింగ్, మయాంక్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు, ప్రిన్స్ యాదవ్ పరుగుల వేగాన్ని కొంతమేర కట్టడి చేసి ఒక వికెట్ తీశాడు. అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ కూడా తలో వికెట్ సాధించారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!