

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన పాకిస్తాన్–అమెరికా మ్యాచ్‌లో పాక్ జట్టు 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది.
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు ఆరంభం నుంచే పాక్ బౌలర్ల ఒత్తిడికి లోనైంది. 42-1, 58-2, 69-3, 123-4, 124-5, 152-6, 152-7, 156-8లా వికెట్లు కోల్పోయిన USA జట్టు చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమైంది. అమెరికా బ్యాటర్లలో శుభమ్ రంజనే 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించగా, జహంగీర్ 49 పరుగులు, మిలింద్ కుమార్ 29 పరుగులు చేశారు. అయినప్పటికీ జట్టు పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది.
పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఫర్హాన్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బాబర్ అజమ్ 46 పరుగులు చేశారు. షాదాబ్ ఖాన్ 30, సయీమ్ అయూబ్ 19 పరుగులతో సహకరించారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్విక్ 4 వికెట్లు తీసి మెరిశాడు. మహ్మద్ మొహ్సిన్, హర్మీత్ సింగ్, నేత్రవాల్కర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్ రనౌట్ కావడం విశేషం. 2024 టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా చేతిలో ఎదురైన పరాజయానికి ఈ గెలుపుతో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!