

టి20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు అహ్మదాబాద్ నగరం క్రికెట్ జోష్‌తో కిక్కిరిసిపోయింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ భారీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే స్టేడియంలో 1.35 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అహ్మదాబాద్‌కు చేరుకుంటున్నారు. అంబానీ, మిట్టల్ కుటుంబాలతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ మ్యాచ్‌కు హాజరుకానున్నారు.
ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో నగరంలోని లగ్జరీ హోటళ్లలో సుమారు 6000 గదులు ఇప్పటికే బుక్ అయ్యాయి. ప్రత్యేకంగా 80 ప్రైవేట్ జెట్లు అహ్మదాబాద్‌కు రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా 23 ప్రత్యేక విమానాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. అభిమానుల రాకపోకల కోసం ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీ స్థాయిలో అభిమానులు చేరుకోవడంతో అహ్మదాబాద్ నగరం క్రికెట్ పండుగలా మారిపోయింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!