
న్యూస్

భారత్–న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు సుమారు రూ.3 వేలుగా ఉండే విమాన టికెట్ ధర ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు చేరింది. మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి అభిమానులు అహ్మదాబాద్‌కు చేరుకుంటుండటంతో విమానయాన రంగంలో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
ఇక నగరంలోని హోటళ్లలో కూడా వసతి ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా రూ.5 వేలుగా ఉండే గది ధర ఇప్పుడు రూ.20 వేల వరకు పెరిగింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే డీలక్స్ రూమ్ ధరలు మరింత పెరిగి సుమారు రూ.2.36 లక్షలు (జీఎస్టీతో కలిపి) వరకు చేరినట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ జోష్‌తో అహ్మదాబాద్ నగరం మొత్తం క్రికెట్ అభిమానులతో కళకళలాడుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!