
గాసిప్స్

భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో నిర్వహించబడుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఈ రోజు 7 న ఘనంగా ప్రారంభం కానుంది. ఓపెనింగ్ డేలో మూడు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు పాకిస్తాన్–నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వెస్టిండీస్–స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి.
సాయంత్రం 6 గంటలకు జరిగే భారత్–అమెరికా మ్యాచ్ ఓపెనింగ్ డేలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అనుభవజ్ఞులైన జట్లతో పాటు ఎదుగుతున్న దేశాలు కూడా తొలి రోజే రంగంలోకి దిగడంతో, ఈ వరల్డ్ కప్ ఆరంభం నుంచే అభిమానులకు హై వోల్టేజ్ వినోదాన్ని అందించనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!