
న్యూస్

సొంత మైదానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరుగులేని జట్టుగా దూసుకెళ్తోంది. దిల్లీ క్యాపిటల్స్ పై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా మూడో గెలుపును నమోదు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకున్న హైదరాబాద్ జట్టు, ఈ సీజన్లో గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముందుగా బ్యాటింగ్ చేయడం విశేషం. దిల్లీకి ఇది మూడో ఓటమి.
ఓపెనర్ అభిషేక్ శర్మ(135 నాటౌట్) అద్భుత శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడు ట్రావిస్ హెడ్ (37), హెన్రిచ్ క్లాసెన్ (37*) రాణించడంతో హైదరాబాద్ 242/2 పరుగులు చేసింది. అనంతరం ఇషాన్ మలింగ (4/32), హర్ష్ దూబే అద్భుత బౌలింగ్‌తో దిల్లీని 195/9కి పరిమితం చేశారు. నితీశ్ రాణా (57) పోరాడినా ఫలితం లేకపోయింది.

.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!