

భారత ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తలసరి జీడీపీలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇన్‌ఫ్రామంత్రా ఆర్థిక గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం, రంగారెడ్డి జిల్లాలో తలసరి జీడీపీ రూ.11.46 లక్షలు నమోదై, ముంబై వంటి సంప్రదాయ ఆర్థిక కేంద్రాలను కూడా వెనక్కి నెట్టింది.
ఈ జాబితాలో హరియాణాలోని గురుగ్రామ్ రూ.9.05 లక్షలతో రెండో స్థానంలో, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ రూ.8.93 లక్షలతో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే గౌతమ్ బుద్ధ నగర్, సోలన్, గోవా జిల్లాలు, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై, అహ్మదాబాద్ టాప్ 10 సంపన్న జిల్లాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల విస్తరణతో వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచస్థాయి రహదారులు, మౌలిక సదుపాయాలు, పర్యాటక అభివృద్ధి కూడా ఈ జిల్లాను దేశంలో అత్యంత సంపన్న జిల్లాగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!