

యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అదరగొట్టాడు. 160 పరుగులతో అద్భుత శతకం సాధించిన రూట్ వల్ల ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా ఫామ్‌లో లేని రూట్ ఈ మ్యాచ్‌తో తిరిగి సత్తా చాటాడు. హ్యారీ బ్రూక్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 169 పరుగులు, జేమీ స్మిత్‌తో ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే చివర్లో వికెట్లు వేగంగా పడటంతో ఇంగ్లాండ్ 400 పరుగుల మార్కును దాటలేకపోయింది.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా ధాటిగా ఆడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 91 పరుగులతో సెంచరీకి చేరువగా నిలిచాడు. లబుషేన్ 48 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 166/2 స్కోరుతో నిలిచింది. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ మూడో రోజు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.








.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!