
జనరల్

సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలికే దిశగా సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం సౌదీ క్లబ్ అల్-నసర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 ఏళ్ల రొనాల్డో.. వచ్చే సీజన్ తన కెరీర్‌లో చివరిది కావొచ్చని వెల్లడించాడు. 2026-27 సీజన్ ముగిసే సమయానికి తన ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశాలున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన రొనాల్డో.. ఫుట్‌బాల్ తర్వాత జీవితంపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘రెండున్నర దశాబ్దాల త్యాగాల తర్వాత నాకు నచ్చిన విధంగా జీవించేందుకు సమయం దొరుకుతుంది’’ అని పేర్కొన్నాడు. ప్రయాణాలు, కుటుంబంతో గడపడం, తనకు ఇష్టమైన ఇతర కార్యకలాపాల్లో నిమగ్నం కావాలని భావిస్తున్నట్లు చెప్పాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!