
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎడిషన్లలోకెల్లా అత్యధికంగా వీక్షించబడిన టీ20 ప్రపంచకప్‌గా ఇది నిలిచింది. ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా 50 కోట్లకుపైగా అభిమానులు వీక్షించినట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ ఏ టీ20 ప్రపంచకప్‌కూ దక్కలేదని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి గరిష్ఠంగా 6.05 కోట్ల మంది మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించినట్లు తెలిపారు, ఇది డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో కొత్త మైలురాయిగా నిలిచింది.






.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!