

రాంచీ లో జరిగే మొదటి వన్డే మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ధోనీ తన రాంచి ఫార్మ్ హౌస్లో కోహ్లీకి విందు పెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరూ చాలా సమయం కలిసి గడిపారు.
విందు అనంతరం, ధోనీ స్వయంగా స్టీరింగ్ పట్టి తన కారులో కోహ్లీని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఈ ప్రయాణంలో ధోనీ కోహ్లీతో విస్తృతంగా చర్చించినట్లు కనిపించింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ వ్యక్తిగత ఇంటరాక్షన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇదే సన్నివేశం నేపథ్యంలో, రాంచి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంతో స్పందిస్తున్నారు. మ్యాచ్కు ముందు ధోనీ ఇచ్చిన మ్యాన్స్, సలహాలు కోహ్లీకి బాగా ఉపయోగపడ్డాయని, అందుకే ధోనీకి థ్యాంక్స్ చెప్పాల్సిందేనని కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.



















కామెంట్స్ (2)
Dhoni–Kohli bond steals the spotlight!
ఇదే అసలు క్రికెట్ ఫ్యామిలీ పవర్!