

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌పై చేసిన సెంచరీ.. అతడి వన్డే కెరీర్లో 54వ శతకం కాగా, అంతర్జాతీయ క్రికెట్లో 85వ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో అతడు ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) రెండో స్థానంలో ఉన్నాడు.
ఇండోర్ హోల్కర్ స్టేడియంలో కోహ్లీకి ఇదే తొలి వన్డే శతకం. దీంతో వన్డే క్రికెట్లో 35 వేర్వేరు వేదికల్లో శతకాలు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (34 వేదికలు) పేరిట ఉండేది. న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో కోహ్లీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ఇండోర్ వేదికగా ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా కోహ్లీదే. వన్డేల్లో అత్యధిక వేదికల్లో శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(26 వేదికలు) మూడో స్థానంలో ఉండగా, 21 వేదికల్లో శతకాలు చేసిన రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!