

భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన వేళ దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఈ విజయోత్సవాల వెనుక ఓ ఆటగాడి గుండెను తాకే కథ దాగి ఉంది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదాన్ని హృదయంలో దాచుకుని ఫైనల్ మ్యాచ్‌లో వీరోచితంగా పోరాడాడు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన కజిన్ సిస్టర్, బావ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్నప్పుడు ఇషాన్ తీవ్రంగా కలత చెందినప్పటికీ, దేశం కోసం మైదానంలోనే నిలబడి తన బాధను అదుపులో పెట్టుకున్నాడు.
ఈ దుర్ఘటన తర్వాత ప్రాక్టీస్ సెషన్లలో దిగులుగా కనిపించిన ఇషాన్‌కు సహచర ఆటగాళ్లు ధైర్యం చెప్పారు. అయితే మ్యాచ్‌లో మాత్రం తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత బ్యాట్‌ను పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ తన స్వర్గస్తులైన సోదరికి నివాళి అర్పించాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి ప్రత్యర్థి జట్టు పతనానికి కారణమయ్యాడు. ఇషాన్ చూపిన ఈ గుండె నిబ్బరం, దేశం పట్ల అంకితభావానికి ఇప్పుడు క్రీడా ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!