
క్రీడలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా – న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ కీలక మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే అదే జట్టుతో బరిలోకి దిగింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చేశారు. మెకాన్సీ స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నారు. రెండు జట్లు కూడా ట్రోఫీ కోసం గట్టిగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!