

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో వెస్టిండీస్ ముందు 224 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 69 పరుగులతో అర్ధశతకం సాధించి ఆకట్టుకున్నాడు. ఇషాన్ 37, తిలక్ 28, నితీష్ 21, అక్షర్ 20 పరుగులతో జట్టుకు తమ వంతు సహకారం అందించారు. అయితే సంజు 3, శ్రేయస్ 1, నమన్ 10 పరుగులకే పరిమితం కావడంతో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది.
వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. చేజ్, స్ప్రింగర్, షెల్డన్ జోసెఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, కీమో పాల్, మోటీ ఒక్కో వికెట్ సాధించారు. చివరి ఓవర్‌లో ప్రిన్స్ యాదవ్ వరుస బౌండరీలతో చెలరేగి 13 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 223కు చేరింది. ఇప్పుడు 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ బరిలోకి దిగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!