
టెక్నాలజీ

హార్దిక్ పాండ్య కు సంబంధించిన ట్రేడ్ వార్తలు ఐపీఎల్ వర్గాల్లో సంచలనంగా మారాయి. నివేదికల ప్రకారం సీఎస్‌కే మరియు ముంబయి ఇండియన్స్ మధ్య హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకురావడానికి సీఎస్‌కే కెప్టెన్సీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ట్రేడ్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్ శివమ్ దూబే తో పాటు యువ ఆటగాడు అయుష్ మాత్రే ను డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇరు ఫ్రాంచైజీలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్‌గా మారి అభిమానుల్లో భారీ చర్చకు దారితీశాయి. ఈ డీల్ నిజమైతే ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!