
తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. టాప్ 7లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో 874 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ 848 పాయింట్లతో రెండో స్థానంలో, ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 803 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 783 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆటగాడు పతుమ్ నిస్సాంక 766 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. మరో భారత ఆటగాడు తిలక్ వర్మ 749 పాయింట్లతో ఆరో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి భారత జట్టుకు గర్వకారణంగా నిలిచారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!