

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచకప్ 2026 గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 48 జట్లు పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. మెక్సికో-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతుండగా, ప్రారంభ వేడుకల్లో షకీరా, నోరా ఫతేహి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఈ ప్రపంచకప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది లయోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో. రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న ఈ దిగ్గజాలు మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. యువ సంచలనాలు యమాల్, ఎంబాపే కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నార్వే, మొరాకో, జపాన్ వంటి జట్లు డార్క్ హార్స్‌లుగా నిలుస్తుండగా, అధిక ఉష్ణోగ్రతల కారణంగా మ్యాచ్‌లలో వాటర్ బ్రేక్‌లను కూడా ఫిఫా ప్రవేశపెట్టింది. ఉత్కంఠభరిత పోటీలు, అద్భుత ప్రతిభ, అపార వినోదంతో ఈ ప్రపంచకప్ అభిమానులకు మరపురాని అనుభూతిని అందించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!