

భారత జట్టు ప్రకటించిన 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా 7 మంది గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, తుది జట్టులో 6 మంది గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ స్పందించారు. ఐపీఎల్ అలవాట్ల నుంచి టెస్ట్ క్రికెట్‌కు ఆటగాళ్లను మార్చడం కష్టమని తెలిపారు. 34 నుంచి 35 డిగ్రీల ఎండలో ఐదు రోజుల మ్యాచ్‌కు అనుగుణంగా ప్లేయర్ల నిద్ర అలవాట్లు, ట్రైనింగ్ రొటీన్ మార్చడంపై దృష్టి పెట్టామని చెప్పారు. ఉదయం జిమ్ సెషన్లు నిర్వహించి ఆటగాళ్లను రెడ్ బాల్ క్రికెట్‌కు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ నంబర్ 3 స్థానంలో ఆడనున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు అరంగేట్రం చేస్తున్న మానవ్ సుతార్‌కు అవకాశం లభించింది. గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ సిరాజ్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకే ఎక్కువ అవకాశం ఇవ్వడంపై శుభ్‌మన్ గిల్‌పై అభిమానులు విమర్శలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!