

IPL 2026 మినీ వేలం డిసెంబర్ 16 (మంగళవారం)న అబుదాబిలో జరగనుంది. ఈ వేలం అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. మొత్తం 350 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననుండగా, పది ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీగా బిడ్లు వేయనున్నాయి. కామెరూన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు వేలంలో ఉండటంతో భారీ ధరలు పలకనున్నాయని అంచనాలు ఉన్నాయి.
ఈ వేలానికి ముందు ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది కామెరూన్ గ్రీన్. అతడు గతంలో మిచెల్ స్టార్క్‌కు వచ్చిన భారీ ధరను మించి బిడ్ దక్కించుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే గ్రీన్‌కు వేలంలో ఎంత ధర వచ్చినా, ఈ సీజన్‌కు అతడి జీతం రూ.18 కోట్లకే పరిమితం అవుతుంది. దీనికి కారణం ఐపీఎల్లో అమలులో ఉన్న ‘మ్యాక్సిమమ్ ఫీ రూల్’. మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఇవ్వగల గరిష్ట జీతం అత్యధిక రిటెన్షన్ స్లాబ్ అయిన రూ.18 కోట్లు మాత్రమే. ఆ మొత్తాన్ని మించిన బిడ్ మొత్తం జట్టు పర్స్ నుంచి కట్ అవుతుందే తప్ప, ఆటగాడి జీతంగా లెక్కించరు.
ఈ వేలంలో పది జట్లు కలిపి మొత్తం 77 ఖాళీ స్లాట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం జట్ల వద్ద కలిపి రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ.64.30 కోట్ల పర్స్‌తో వేలంలోకి అడుగుపెడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా మంచి పర్స్‌తో బిడ్డింగ్‌కు సిద్ధంగా ఉండగా, ముంబై ఇండియన్స్ మాత్రం కేవలం రూ.2.75 కోట్లతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితిలో ఉంది.
జట్టు వారీగా ఖాళీ స్లాట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: 9 (విదేశీ ఆటగాళ్లు 4)
ఢిల్లీ క్యాపిటల్స్: 8 (విదేశీ ఆటగాళ్లు 5)
గుజరాత్ టైటాన్స్: 5 (విదేశీ ఆటగాళ్లు 4)
కోల్‌కతా నైట్ రైడర్స్: 13 (విదేశీ ఆటగాళ్లు 6)
లక్నో సూపర్ జెయింట్స్: 6 (విదేశీ ఆటగాళ్లు 4)
ముంబై ఇండియన్స్: 5 (విదేశీ ఆటగాళ్లు 1)
పంజాబ్ కింగ్స్: 4 (విదేశీ ఆటగాళ్లు 2)
రాజస్థాన్ రాయల్స్: 9 (విదేశీ ఆటగాళ్లు 1)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 8 (విదేశీ ఆటగాళ్లు 2)
సన్‌రైజర్స్ హైదరాబాద్: 10 (విదేశీ ఆటగాళ్లు 2)
జట్టు వారీగా మిగిలిన పర్స్ (రూ.కోట్లలో):
కోల్‌కతా నైట్ రైడర్స్ – 64.30
చెన్నై సూపర్ కింగ్స్ – 43.40
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 25.50
లక్నో సూపర్ జెయింట్స్ – 22.95
ఢిల్లీ క్యాపిటల్స్ – 21.80
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 16.40
రాజస్థాన్ రాయల్స్ – 16.05
గుజరాత్ టైటాన్స్ – 12.90
పంజాబ్ కింగ్స్ – 11.50
ముంబై ఇండియన్స్ – 2.75








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!