
.png&w=3840&q=75)
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. గతంలో తాను అనుకున్నట్లే అభిషేక్ ఇప్పుడు నిజంగా సూపర్ స్టార్‌గా ఎదిగాడని పేర్కొన్నాడు. ఐపీఎల్లో అభిషేక్‌కు తానే తొలి కోచ్‌నని పాంటింగ్ గుర్తు చేశాడు. 17 ఏళ్ల వయసులో ఢిల్లీ తరఫున ఆడిన అభిషేక్, తొలి బంతికే ఫోర్ లేదా సిక్స్ బాదిన దృశ్యం ఇప్పటికీ గుర్తుందన్నాడు. అప్పుడే అతనిలో ప్రత్యేకత కనిపించిందని, అభిషేక్‌ను ట్రేడ్ చేయొద్దని ఢిల్లీ మేనేజ్మెంట్ను పదే పదే కోరినట్లు చెప్పాడు.
రానున్న ICC Men's T20 World Cup లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తాడని పాంటింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకునే సత్తా అతనికి ఉందని అన్నాడు. అభిషేక్ ఫామ్‌లో ఉంటే భారత్‌ను ఓడించడం మరింత కష్టమవుతుందని, ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు అతడు కీలక ఆటగాడిగా నిలుస్తాడని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!